ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన…
Nimmala Ramanaidu : పోలవరం టీడీపీ 72శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఎప్పటికీ పూర్తి చేస్తామో చెప్పలేమని చేతులు ఎత్తేసిందన్నారు ఏలూరు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వైసీపీ టైం లో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ స్థలంలో కొత్త వాల్ పనులు జనవరి రెండు నుంచి ప్రారంభమవుతాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో వేగం…
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మరువ కూడదని.. కొందరు తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని పవన్ వ్యాఖ్యానించారు.
జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు
వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం.... మనం పవర్లోకి వచ్చాకా... ఇబ్బందులు పడుతున్నాం. ఇక బతుకంతా ఇంతేనా? కొట్లాడుతూనే ఉండాల్నా? ఇంకెన్నాళ్ళిలా పోరాటం.... అంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఏదేమైనా సరే... వెనక్కి తగ్గేదే లేదు. ప్రైవేట్ కేసులు వేసైనా సరే... నేను అనుకున్నది సాధిస్తానంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయన అసహనానికి కారణం ఏంటి?
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో సుమారు 20 మంది చనిపోయారని.. ఆ ఘటనకు ఎవరిని బాధ్యులుగా చేశారని ప్రశ్నించారు.
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.