పార్టీ మారిన కార్పొరేటర్లను వారి విజ్ఞతకే వదిలేద్దామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో కడప మున్సిపల్ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Nimmala Ramanaidu : 2014 నుంచి ఇరిగేషన్ శాఖ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ కడపజిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్విర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదన్నారు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసిపి పాలనలో చేయలేకపోయారని, గాడి…
Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్…
Nara Bhuvaneshwari : చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తారని, చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసమన్నారు నారా భువనేశ్వరి. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికీ ఎంతో అవసరమన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్నివిధాలా సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగ నమ్మే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు.…
Minister Nimmala Rama Naidu: ఆరేళ్ల అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో రైతులు విసుగెత్తిపోయారన్నారు. Read Also: Minister…
ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన…
Nimmala Ramanaidu : పోలవరం టీడీపీ 72శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఎప్పటికీ పూర్తి చేస్తామో చెప్పలేమని చేతులు ఎత్తేసిందన్నారు ఏలూరు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వైసీపీ టైం లో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ స్థలంలో కొత్త వాల్ పనులు జనవరి రెండు నుంచి ప్రారంభమవుతాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో వేగం…
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
మన కోసం ఎవరు నిలబడ్డారో వారిని మరువ కూడదని.. కొందరు తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని పవన్ వ్యాఖ్యానించారు.