చేబ్రోల్ కిరణ్‌ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుపడ్డ ఈ కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు.. గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. అంతకు ముందు కోర్టుకు తీసుకెళ్తున్న గోరంట్ల మాధవ్ ను తిరిగి ఎస్పీ ఆఫీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మరోసారి పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులు తిరిగి కోర్టుకు తీసుకెళ్లారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. “నేను దేశానికి ఎంపీగా పని చేశా.. నేను ఏమైనా దోపిడీ దొంగనా?” అంటు కేకలు వేశారు.
READ MORE: WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా!
ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ అరెస్టు వివరాలను వెల్లడించారు. చేబ్రోలు కిరణ్ ను కొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ‘‘చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని అనుచరులతో కలసి మాధవ్ అడ్డుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కిరణ్‌పై మాధవ్ దాడికి పాల్పడ్డారు. గోరంట్లతోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద కూడా వారు దాడికి పాల్పడ్డారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఇది నేరపూరిత చర్య. మాధవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశాం. మరో ఆరుగురిని అరెస్టు చేశాం’’అని తెలిపారు.
READ MORE: YSRCP Syamala : మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు..