Off The Record: శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ, ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ళ ఆవేదన. అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో రాజకీయాలలోని వచ్చిన…
CM Chandrababu: మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పాలనలో జరిగిన వివిధ అక్రమాలపై విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది.. దీనికి సుమారు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎ్ జగన్ అక్రమాలు ఒకటి, రెండు కాదు.. ఆయన పాలనలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చేశారని వ్యాఖ్యానించారు.. అయితే, ఈ కేసులను విచారిస్తూ…
Peddireddy Ramachandra Reddy: రాష్ట్ర ప్రజలకు ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతుందని.. ఈ రెండేళ్లలో ఒక అభివృద్ధి పథకం గాని సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అప్పుల కోసం వెంపర్లాడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని..
Krishna: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ పథకం కొందరికి వరంగా మారితే, పామర్రు నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే గనిగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, నది గర్భాన్ని ఛిద్రం చేస్తూ ఇసుక మాఫియా సాగిస్తున్న దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పామర్రు నియోజకవర్గ పరిధిలోని రొయ్యూరు, లంకపల్లి, తోట్లవల్లూరు ఇసుక రీచ్‌లు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అధికార పార్టీకి చెందిన ముగ్గురు…
Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన…
Botsa Satyanarayana: మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
YS Jagan: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ( డిసెంబర్ 23) నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలోని పులివెందుల నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మాజీ సీఎం జగన్‌కు అస్సలు పడదు. ఛాన్స్ దొరక్కున్నా… దొరకబుచ్చుకుని మరీ… జగన్‌ను ఏకిపారేస్తుంటారు పవన్. అట్నుంచి కూడా అంతే. పవన్ కళ్యాణ్‌ను పూచికపుల్లతో సమానంగా తీసేస్తారు వైసీపీ లీడర్స్. జగన్ మీద పవన్ ఒక్క కామెంట్ చేస్తే చాలు….. మా నేతను అంత మాట అంటావా అంటూ రాష్ట్రం నలులమూల నుంచి విరుచుకుపడే వాళ్లు ఫ్యాన్ పార్టీ నాయకులు. వెంటనే ప్రెస్మీట్లు పెట్టే వారు.…
Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితం, స్పీకర్ బాధ్యతలు, సైబర్ నేరాలు, యువత పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కావడానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడేవాడినని, స్పీకర్ అయిన తర్వాత మాత్రం నోటికి ప్లాస్టర్ వేసినట్టయ్యిందని వ్యాఖ్యానించారు. సభలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం తప్ప గత రెండేళ్లుగా మాట్లాడే అవకాశం లేదని అన్నారు. స్పీకర్ పదవి చాలా…
Pawan Kalyan: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే…