Nandyal: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో కొందరు బాల్య మిత్రులు కలిసి చనిపోయిన స్నేహితుడి కుమార్తె వివాహం జరిపించారు. ఈ సందర్భంగా పెళ్లి పెద్దలుగా మారి పెళ్లి కూతురి పల్లకి సైతం మోశారు.
Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు…
NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడో రోజు కూడా నిలిచిపోయింది. ఈ పథకం కింద సేవలు అందించే స్పెషాలిటీ ఆసుపత్రులు తాత్కాలికంగా సేవలను ఆపేశాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులకు చికిత్స అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాల వినియోగంపై ప్రజల సూచనలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది.
YS Jagan: రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించనున్నారు. తాజాగా జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు.. రేపు ఉదయం 9.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు..10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 11.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి…