Vijayawada: విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేస్తున్న క్రమంలో ఓ సీఐ బూతులు తిట్టారు. దీంతో యువకులు పోలీసులకు ఎదురు తిరిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మిగతా వాహనదారులు మద్దతుగా నిలిచారు. దీంతో అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి రప్పించారు పోలీసులు.. ఈ ఘటనపై సీఐ కిషోర్ యువకులకు…
CM Chandrababu: టీటీడీ భక్తులకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. నూతన బస్‌స్టాండ్ అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అనకాపల్లి జిల్లాలో పరువు హత్య జరిగిందా? కులమతాలకు అతీతంగా నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారి తీసిందా? తమతో పాటే యువకున్ని తీసుకెళ్లిన తల్లి, బిడ్డ అతన్ని ఏం చేశారు?
Nara Lokesh: ఏపీ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి వాసులు నేపాల్ రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయిన ఘటనపై స్పందించారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హోటల్లో 8 మంది మంగళగిరి వాసులు తలదాచుకుని ఉన్నారు. బాధితులు మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. బాధితులు తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి వద్ద మరో 40 మంది…
రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్‌ను వివిధ ఫేజ్‌లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు వర్మ – వంగా గీత మధ్య యూరియా సరఫరా సమస్యపై మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితం పిఠాపురంలోని పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి యూరియా సమృద్ధిగా దొరుకుతుందా అని పరిశీలించిన వర్మ, వైసీపీ ఎమ్మెల్యేలను “కళ్ళు ఉన్న కబోదులు” అని విమర్శించారు. వర్మ మాట్లాడుఊ.. “అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 నియోజకవర్గాలలో…
Temple : అమ్మోరు తల్లి.. క్షమించు… తెలియక తప్పు చేశాం.. నీ ఆలయంలో దొంగతనం చేయడం నేరమే.. అందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇవిగో నీ దగ్గర దొంగిలించిన సొమ్ము.. నీవే తీసుకో తల్లి. దయచేసి మమ్మల్ని ఒగ్గెయ్ తల్లి…. ఇదీ దొంగలు రాసిన లేఖ. అదే ఆలయంలో చోరీ చేసి.. తిరిగి ఆ సొమ్మును అమ్మవారి ఆలయం వద్దే తీసుకు వచ్చి పెట్టేశారు. పైగా అందులో.. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటన అనంతపురం…