Tuni Minor Rape Case: నారాయణరావు మైనర్ బాలికను ఐదుసార్లు బయటకు తీసుకుని వెళ్ళాడని డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు అత్యాచారం చేశాడని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. నారాయణ రావు ను మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్లే సమయంలో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు.. పర్సనల్ ఇష్యూ వల్ల వెహికల్ ఆపమని చెప్పాడు.. వెంటనే చెరువులో దూకేశాడు.. నారాయణ రావు కి ఆయన కొడుకుకి సంబంధాలు సరిగా లేవు.. శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఇంటికి తీసుకొస్తామని మెజిస్ట్రేట్ కి సమాచారం ఇచ్చాము.. ఘటన జరిగిన వెంటనే మెజిస్ట్రేట్ కి చెప్పామని డిఎస్పీ వివరించారు. తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించారు.
READ MORE: Rohit Sharma: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. 2015 తర్వాత ఇదే..
మరోవైపు.. తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే నారాయణరావు ఫ్యామిలీ అడ్డుకుంది. ఆందోళన చేసేవాళ్లను పక్కకు లాగి మృతదేహాన్ని తరలించారు పోలీసులు.. నారాయణరావు మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరావుది సూసైడ్ కాదంటున్న కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నలుగురు పోలీసులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. రాత్రి పదిన్నరకు చెరువులో దూకితే ఇవాళ ఉదయం 7గంటలకు సూసైడ్ చేసుకున్నాడని సీఐ చెప్పారన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేందని ప్రశ్నించారు.
READ MORE: Gold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!