Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.
ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది. ఏపీలో…
Tuni Minor Rape Case: నారాయణరావు మైనర్ బాలికను ఐదుసార్లు బయటకు తీసుకుని వెళ్ళాడని డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు అత్యాచారం చేశాడని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. నారాయణ రావు ను మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్లే సమయంలో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు.. పర్సనల్ ఇష్యూ వల్ల వెహికల్ ఆపమని చెప్పాడు.. వెంటనే చెరువులో దూకేశాడు..
ఈ రోజు ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక, ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ విమానంలో బయలుదేరనున్నారు.
PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్‌లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్‌ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.
CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…