Son Kills Mother: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది.. నాతవరం మండలం, వైబీపట్నం గ్రామంలో తల్లిన హత్య చేసిన కొడుకు ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిటికెల మంగ (56) కొడుకు రామ్మూర్తినాయుడు మధ్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ ఆస్తి పంచాలని తల్లిని వేధించసాగాడు. దీనికి అడ్డు చెప్పిన తల్లిని ఇబ్బందులు గురిచేసేవాడు. US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత ఈ పరిస్థితుల్లో తెల్లవారుజామున…
Kurnool Murder: కర్నూలులో పట్టపగలే మర్డర్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని అతి దారుణంగా హత్య చేశారు. బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి వృద్ధురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శివలీల అనే వృద్ధురాలు ఇంట్లో కిచెన్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మారణయుధాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఆమె…
Cows Thieves: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటి వరకు ధనవంతుల ఇండ్లు టార్గెట్ చేసి ఖరీదైన బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు కొంత మంది దొంగలు రోడ్ల మీద ఉన్న పశువులను కూడా వదలడం లేదు. అర్థరాత్రి వచ్చి వాటిని దర్జాగా ఎత్తుకు వెళ్లిపోతున్నారు. మొన్న హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్.. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంతా చేసి వారు దోచుకు వెళ్లేది ఏదైనా ఖరీదైన…
Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…
Fake ED Officers: గుంటూరు జిల్లాలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పోలీసులమంటూ నటించిన దుండగులు భారీ దోపిడీ చేశారు. సుమారు రూ. 70 లక్షల నగదుతో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Triple Murder Case: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం రేపుతుంది. తల్లి మాధురి, ఇద్దరు కూతుర్లు కుమారి ,జెస్సీలను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
Murder : బాపట్ల జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు…గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈఘటన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలకలం రేపింది. ఒక్కసారిగా స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంత కాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరాస్వామిరెడ్డికి, సంతమాగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య…