CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది అని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతం కానీ.. గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజులపాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కావనున్నట్టు సమాచారం. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. Read Also: Jagan Mohan Reddy: వైఎస్…
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం. పల్లె నుంచి పట్నం వరకు, దేశధినేతల నుంచి విదేశీయుల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై సీఎం స్పందించారు. "నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు." అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. చాలా విషయాలను…
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రూరల్ టైలర్స్ అసోసియేషన్ వారికి 20 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. యార్లగడ్డ సొంత ఖర్చుతో..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని.. అలాగే, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన అష్ఠ ద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మీ, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం రెండో రోజు విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది.
40 Years Of Oath: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అని టైటిల్ కార్డ్స్ లో పడితే, ఓ ప్రముఖ గీత రచయిత ‘విశ్వమంటే ఆంధ్రప్రదేశా?’ అని ఎద్దేవా చేశారట. కానీ ఎన్టీఆర్ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని అభినందించింది సర్వసంగ పరిత్యాగులు ఓ పీఠాధిపతులు. వారి వాక్కు పొల్లుపోలేదు. సరిగా 40 ఏళ్ళ క్రితం జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 జనవరి 9వ తేదీన అశేషజనవాహిని ముందు…