Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిక్కచ్చిగా మాట్లాడతారని పేరు ఉన్న ఆయన, నటుడిగా సినీ రంగానికి పరిచయమై, తర్వాత బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా అనేక హిట్స్ అందుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల నిర్మాణానికి బ్రేక్ ఇచ్చిన ఆయన, మళ్లీ కొత్త నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.
Read Also: Kakani Govardhan Reddy: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి చంద్రబాబు చరమగీతం పాడారు..
అయితే, కొద్ది సంవత్సరాల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి అధికార హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఈ కేసు నుండి బయట పడాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని స్వతహాగా చంద్రబాబుకు అభిమాని అయిన బండ్ల గణేష్, తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఇక తర్వాతి కాలంలో ఆయన కేసులో బెయిల్ మీద బయటకు రావడం, తదనంతర పరిణామాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Read Also: Traffic Alert: సొంతుళ్లకు పయనమైన ఏపీ వాసులు.. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..
ఇప్పుడు తాను మొక్కుకున్న మొక్కు తీర్చుకునేందుకు బండ్ల గణేష్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి తిరుమలకు ఆయన మహా పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్నారు. ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి, ఆ రోజు ఆయన షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.