Off The Record: రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడటం ఒక ఎత్తయితే…. ఎక్కువ మంది మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఫాలో అవుతుంటారు. అందులో కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సెక్షన్ కూడా ఒకటుంటుంది. వాళ్ళు మనవాళ్ళో పగవాళ్ళో తెలిసే లోపే… జరక్కూడని నష్టం జరిగిపోతుంది. కుదిరితే కుట్రలతో ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లేదంటే వెన్నుపోటు పొడిచి దెబ్బ తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది అనంతపురం జిల్లా. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ..
వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు.
మిర్చి రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వెంకటరామి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డుకు…
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదని, వైసీపీ పార్టీ నాయకులంతా వస్తారన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడను అని చెప్పారు. తాను అవినీతి చేసుంటే.. విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తాడిపత్రిలోనే కాదు అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం అని వెంకటరామిరెడ్డి చెప్పుకొచ్చారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… ‘నా తల్లిదండ్రులు నన్ను సంస్కారంతో పెంచారు. నాలుగు సార్లు ఎంపీగా,…