తమిళ చిత్రసీమలో కమెడియన్ సంతానంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. దాంతో సంతానం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అలా మూడేళ్ళ క్రితం ‘సర్వర్ సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. కానీ గ్రహచారం బాగోక ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అది ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే… గత యేడాది ఈ సినిమా దర్శకుడు ఆనంద్ బల్కీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై అభిప్రాయం చెప్పమని నెటిజన్లను కోరాడు.…