Brain Infection: కేరళను అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’ భయపెడుతోంది. ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’గా పిలిచే ‘‘మెదడును తినే అమీబా’’ కారణంగా మరో ఇద్దరు మరణించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు ఈ అరుదైన వ్యాధికి బలైనట్లు ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆగస్టు నాటికి 3కు చేరింది.
Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా మరణించాడు. ఇది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత.. అమీబా మెదడుకు సోకింది. దీంతో బాలుడిని జూన్ 24న ఆసుపత్రిలో చేర్చారు, అయితే అతను చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత…