Police Charge Sheet on Amnesia Pub Case.
హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే నిందితులను ఆరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఆ కేసులో చార్జ్‌షీట్లను కోర్టుల్లో దాఖలు చేశారు. 2 కోర్టుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జువైనల్ కోర్టుతోపాటు నాంపల్లి కోర్టులో 56 రోజుల్లోనే పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్‌షీట్లల్లో సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు పొందుపరిచారు పోలీసులు. సాదుద్దీన్‌తోపాటు ఎమ్మెల్యే కొడుకుపై అభియోగాలను పోలీసులు రికార్డ్ చేశారు. 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించిన పోలీసులు.. 600 పేజీలతో చార్జ్‌షీట్ వేశారు.
ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్‌ఏ, సీసీ ఫుటేజ్, ఫోన్ల రికార్డ్, మెసేజ్‌లు.. ప్రొటెన్సివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిచారు. నిందితులు బాలికను ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేసిన నిందితులు.. కారులో బాలికపై గ్యాంగ్ రేప్ చేసినట్లు అంతేకాకుండా.. పలుకుబడి ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించేందుకు నిందితులు యత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు జువైనల్స్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.