రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అమ్నీషియా గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. నేరానికి పాల్పడ్డ ఐదుగురు మైనర్లలో.. నలుగురు మైనర్లను ట్రైల్ సందర్భంలో మేజర్లుగా పరిగణిస్తూ బోర్డు తీర్పు ఇచ్చింది. నేరానికి పాల్పడ్డ సమయంలో నిందితుల వయసు 16 నుండి 18 సంవత్సరాలు ఉండగా.. నిందితులందరూ తీవ్ర నేరానికి పాల్పడిన దృశ్య వీరిని మేజర్లుగా పరిగణించాలని బోర్డును పోలీసులు కోరారు. నలుగురు సిసిఎల్ లను ప్రత్యేకంగా విచారించిన బోర్డు.. మానసిక నిపుణుడి సహాయంతో సిసిఎల్ మెంటల్ స్టేటస్ ను విశ్లేషించింది. ఎమ్మెల్యే కొడుకు విషయంలో ప్రాథమిక అంచనాకు రాని బోర్డు.. ఎమ్మెల్యే కొడుకుపై ఉన్న అభియోగం తీవ్రమైనది కాకపోవటంతోనే పరిగణించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే.. A1 సయ్యద్ నిజాల్ ఫజిలత్, A2 మహమ్మద్ కొమరానుల్లా ఖాన్, A3 మహ్మద్ హబీబ్, A4 రహిల్ ఖాన్ లను మేజర్లుగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
A1 మెంటల్ స్టెబిలిటీని అంచనా వేసిన బోర్డు.. తాను ఒక ఫుట్బాల్ ఛాంపియన్ అని, తనకి మద్యం సేవించే అలవాటు లేదని ఫజీలత్ తెలిపాడు. A2 కమ్రానుల్లాఖాన్ హార్స్ రైడింగ్ ఛాంపియన్ అని.. A3 హబీబ్ లండన్ లో బారిష్టర్ చదవడమే లక్ష్యమని, A4 రహీల్ ఖాన్ ఇటలీలో ఆర్కిటెక్ చదవటమే లక్ష్యమని విచారణ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈనెల 28న నలుగురు సిసిఎల్ ల మానసిక స్థితిపై నివేదిక ఇచ్చిన సైకియాట్రిస్ట్.. సైకియాట్రిస్ట్ నివేదికతో ఏకీభవించిన బోర్డు.. నలుగురు సిసిఎల్ లు ఎటువంటి మద్యం అలవాటు లేదని నిర్థారించింది. నేరం జరిగిన సమయంలో వీరు మద్యం సేవించలేదని, నాంపల్లి చిల్డ్రన్స్ కోర్టుకు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.