జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును సీరియస్ గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. అయితే ఇవాళ (ఆదివారం) ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాలు పోలీసులు, అధికార టీఆర్ఎస్ పార్టీపై ఒత్తడి పెంచుతున్నాయి. గత రెండు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్ లో ప్రవేశపెట్టారు. కేసులో అత్యంత కీలకంగా మారిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులోనే బాధితురాలిపై…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నవిషయం తెలిసిందే.. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్…
జూబ్లిహిల్స్ ఆమ్నేసియా పబ్ అత్యాచార కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఈ కేసులో నిందితులుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. భరోసా సెంటర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బాధిత అమ్మాయి పూర్తి వివరాలను చెప్పిందని ఆయన వెల్లడించారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు. అమ్మాయి…
చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి…