తెలంగాణపై ఎన్నడూలేనంతగా ద్రుష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్ లో వరుసగా ల్యాండవుతున్నారు. తెలంగాణపై వాగ్ధానాలు కురిపిస్తూనే, టీఆర్ఎస్ సర్కారుపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్ తో రియాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా కాషాయదళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ…
దక్షిణాదిలో తెలంగాణలో కూడా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంపై అన్నిరకాల ఎఫర్ట్స్ పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది గోల్. ఆపై లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడున్న నాలుగు సీట్లే కాకుండా మరిన్నిచోట్ల పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు తరచుగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌కు ప్రధాని మోడీ వచ్చారు. ఆయన నగరంలో ఉన్నది కొద్ది గంటలే అయినప్పటికీ.. అందులో పార్టీకి కూడా సమయం కేటాయించారు. రాష్ట్రంలో…
ఆపరేషన్ ఆకర్ష్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో చేపట్టింది. ఇతర పార్టీల నేతలకు వలలు.. గేలాలు ఎన్నో వేస్తోంది. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చలు అనేకం. అదిగో వచ్చేస్తున్నారు.. ఇదిగో వచ్చేస్తున్నారు అనే హడావిడి తప్పితే బీజేపీ గడప ఎక్కినవాళ్లు తక్కువే. ఇతర పార్టీలలో పెద్ద నేతలుగా చెలామణి అవుతున్న వాళ్లు బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలిందని అనేక లీకులు ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..…
తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరుకు పార్టీ అగ్రనేత అమిత్ షా చెక్ పెట్టినట్టేనని తాజా టాక్. పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కే హైకమాండ్ అండ అని తుక్కుగూడ సభలో షా క్లారిటీ ఇవ్వడంతో.. కాషాయ శిబిరంలో అలజడి మొదలైందట. బహిరంగ సభ నుంచే పార్టీ నేతలకు.. శ్రేణులకు షా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ అంశాలపైనే వాడీవేడీ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు బీజేపీ సీనియర్లకు బీపీ ఎక్కువైందట. బండి…
ముచ్చింతల్‌లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు..…
నాగాలాండ్ నుంచి AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ఆమోదం తెలిపారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)రద్దు అంశంపై కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నాగాలాండ్…
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ…
తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల పర్యటనలతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో చలి చంపేస్తుంటే.. నేతలు వరి చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ బాద్ షా అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కేసీఆర్ ట్రాప్ లో పడకండని హితవు పలికారు హోం మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కేసీఆర్‌తో…