బీజేపీ దూకుడుకి బ్రేక్ పడిందా? ఆ ఎఫెక్టే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.
అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పట్లో యాత్ర ఉండక పోవచ్చు అంటున్నారు బీజేపీ నేతలు. నిరుద్యోగ దీక్షకు అనుమతి ఇవ్వలేదు. ఇటు బీజేపీ సంగ్రామ యాత్రకు అనుమతి సందేహమే అంటున్నారు కమలనాథులు. కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ జాగ్రత్తలు జారీ చేస్తుంది. దీంతో ఒమిక్రాన్ పై క్లారిటీ వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు సడలించే వరకు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు ఉండక పోవచ్చు అన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
Also Read
అలాగే తెలంగాణలో త్వరలో పర్యటిస్తానని, సభల్లో పాల్గొంటానని బీజేపీ బాద్ షా అమిత్ షా తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ లో ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా సభ కూడా ఇప్పట్లో ఉండక పోవచ్చు అంటున్నారు. రెండు రోజుల సమయం ఇస్తానని.. డేట్స్ చెబుతా నని షా రాష్ట్ర నేతలకు చెప్పిన అమిత్ షా అందుకే మిన్నకుండి పోయారంటున్నారు. ఒమిక్రాన్, కోవిడ్ పై స్పష్టత వస్తేనే ఆయన పర్యటన ఉంటుందని బీజేపీ కీలక నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 28 నుండి అక్టోబర్ 2 వరకు మొదటి విడత సంగ్రామ యాత్ర చేశారు బండి సంజయ్. త్వరలో సంగ్రామ యాత్ర ప్రారంభిస్తానన్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!