Kapil Sibal: రామ నమవి రోజున, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చెలరేగాయి. చాలా వరకు ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ హింసాకాండపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ప్రశ్నించారు మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానాంశం కాకూడని ఆయన అన్నారు.
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
బెంగాల్, బీహార్ లో చెలరేగిన హింస, విద్వేష బీజాలు రాజకీయ నాయకులు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే మేలు చేకూర్చేవిగా ఉన్నాయని కపిల్ సిబల్ అన్నారు. వీటి వల్ల సామాన్యుడు బలవుతున్నాడని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి హింసపై మాట్లాడకపోవడం దురదృష్టకరమని వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణలకు దూరంగా దేశం ముందుకు సాగాలని ఆయన అన్నారు.
అంతకుముందు బీహార్ అల్లర్లపై ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు. రామ నవమి రోజున బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు జరిగాయి.