నాలుగో విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శుక్రవారం) మరోసారి పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. ఈ రోజున అసన్సోల్, రాంపూర్హాట్, రానాఘాట్లలో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
Amit Shah: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు.
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Amit Shah: లోక్సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్, రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రామ మందిరానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు.
లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలతో ప్రజల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ఓటు షేర్ పెరిగిందని.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో స్థానంలో నిలపడమే ఎన్డీఏ లక్ష్యమని అన్నారు. సీఎంగా,…
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా