Akbaruddin Owaisi: హైదరాబాద్ లో రజాకార్ల పరిపాలన కొనసాగుతుందని అమిత్ షా మాటలకు అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో ఎవరు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అందరికీ తెలుసన్నారు.
‘సీబీఐ కేంద్రం నియంత్రణలో లేదు’.. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాస్తవానికి అనేక కేసుల్లో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇందులో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్నప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు…
ఈ నెల 5 న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్‌ను బీజేపీ విడుదల చేసింది. 5న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్‌నగర్ లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభకు విచేస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో…
సార్వత్రిక ఎన్నికల హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఒక నకిలీ వీడియో రావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Amit shah Fake video Case: రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయింది. అయితే ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వీరిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ…