సార్వత్రిక ఎన్నికల హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఒక నకిలీ వీడియో రావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Amit shah Fake video Case: రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయింది. అయితే ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వీరిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ…
అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అమిత్ షా అన్నారు. SC,ST, OBCలకు రిజర్వేషన్లు ఉండటానికి బీజేపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని తెలిపారు.
Amit Shah: రిజర్వేషన్లపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కొందరు కావాలనే జనాల్లో భయాందోళనలు రెకెత్తించి, బీజేపీని అడ్డుకునేలా చేసేందుకు ఈ వీడియోలను వైరల్ చేసినట్లు తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్ లోపం వల్ల ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ కొద్ది సేపటికే నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ లో సోమవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరైన అమిత్ షా ప్రచారాన్ని ముగించుకుని హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే., టేకాఫ్ కాగానే విమానం అదుపు తప్పి కుడివైపుకు మళ్లింది. ఒక క్షణం అతను దాదాపు నేలను తాకబోయాడు. Also Read: ATM Blast:…
Amit Shah Video: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలని కోరారు.