Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దారుణ ఫలితాలు తెచ్చుకుంది. 48 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ 09 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీయే కూటమి మొత్తంగా 17 స్థానాలను గెలుచుకుంది.
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం లభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన వాదనలను నిరూపించేందుకు ఈసీని వారం రోజుల సమయం కావాలని కోరారు. దానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ఈసీ.. వాస్తవ వివరాలను బయటపెట్టాలని కోరింది. ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా.. అందుకు వారం రోజుల గడువు…
Jairam Ramesh: మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్‌షా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.