దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం లభించింది. గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన వాదనలను నిరూపించేందుకు ఈసీని వారం రోజుల సమయం కావాలని కోరారు. దానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ఈసీ.. వాస్తవ వివరాలను బయటపెట్టాలని కోరింది. ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా.. అందుకు వారం రోజుల గడువు…
Jairam Ramesh: మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్షా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ ఖరారయ్యింది. అమిత్ షా రేపు సాయత్రం 6:15 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేపు రాత్రి తిరుమలలోని వకుళామాత నిలయంలో బస చేస్తారు.
BCCI Receives 3000 Applications for Team India Head Coach Job: టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్ పదవి కోసం ఏకంగా 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో…
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.