కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఎస్పి యొక్క పూర్తి అర్థం ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి కొనుగోలు చేస్తోందని అమిత్ షా తెలిపారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు.
Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amit Shah : జమ్మూకశ్మీర్‌లోని నౌషేరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలంటూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, సంజయ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరుకావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,…
Amit Shah: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ దేశంలోని రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ..‘‘దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తుల’’తో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు.
సమన్వయ ప్లాట్‌ఫాంలో నేర విశ్లేషణ మాడ్యూల్ అభివృద్దిలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చూపిన ప్రతిభకుగానూ కేంద్ర హోం శాఖ అవార్డును ప్రదానం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) మొదటి ఆవిర్భావ దినోత్సవాన్నిఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అవార్డును స్వీకరించారు. నేర గణాంకాల విశ్లేషణ, నేరాల మధ్య ఉన్న…
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్…