ఇజ్రాయిల్‌కు చెందిన పెగసిస్ స్పైవేర్ పార్లమెంట్‌ను కుదిపేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈరోజు రాజ్యసభలో కోవిడ్ పై చర్చజరగాల్సి ఉన్నది. అయితే, రాజ్యసభలో జరగాల్సిన అన్ని చర్చలను పక్కన పెట్టి పెగసిస్ స్పైవేర్ పై చర్చను జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు కథనాలగా పేర్కొన్నాయి. ఇండియాకు చెందిన 300 మందిపై నిఘా ఉంచారని ఆయా మీడియాలు పేర్కొన్నాయి.
Read: భారీ వర్షాల్లోనే బాలీవుడ్ షూటింగ్స్…
అయితే, ఇవన్నీ అర్ధంలేని కథనాలని లోక్‌సభలో కేంద్రం ప్రకటన చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధితో సహా, కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చెందిన ఫోన్ నెంబర్‌పై నిఘా ఉంచారని కథనాలు. అన్నింటిని పక్కన పెట్టి పెగసిస్ పై చర్చంచాలని, దేశానికి చెందిన ప్రముఖుల సమాచారం విదేశీ సంస్థలకు అప్పగించడం దేశద్రోహం అవుతుందని, ప్రధాని మోడిపై విచారణ జరపాలని, హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.