Usha Chilukuri: తన భర్త జేడి వాన్స్ అమెరికాకు గొప్ప ఉపాధ్యక్షుడు అవుతారని ఆయన భార్య, భారత సంతతి వ్యక్తి ఉషా చిలుకూరి తెలిపారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు, అమెరికా పౌరులకు వాన్స్ ని ఆమె పరిచయం చేసింది. ఆయన భారతీయ వంటకాలను వండగలరు.. మొదట మేం ఫ్రెండ్స్.. వాన్స్ చాలా ఆసక్తికరమైన వ్యక్తి.. చిన్నప్పటి నుంచి కష్టాలను అధిగమించి జీవితంలో పైకి ఎదిగారు అని చెప్పుకొచ్చింది. నా శాకాహార అలవాట్లను ఆమోదించడమే కాకుండా నా తల్లి నుంచి భారతీయ వంటకాల వాన్స్ నేర్చుకున్నారు అని ఉషా చిలుకూరి వెల్లడించింది.
Read Also: Budget 2024 : మూడు కోట్ల మంది కల నెరవేర్చనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఇక, మేం స్నేహితులుగా ప్రయాణం స్టార్ట్ చేశాం.. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు అని ఉషా చిలుకూరి తెలిపింది. కాళీ సమయంలో కుక్క పిల్లలతో జేడీ వాన్స్ టైం పాస్ చేస్తారని పేర్కొనింది. తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితంపై ఉషా ప్రభావం చాలా ఉంది.. తన అర్ధాంగిని ఎంతగానో ప్రేమిస్తానని వాన్స్ తన ప్రసంగంలో వెల్లడించాడు. ఆమె న్యాయవాది, ఉత్తమమైన మాతృమూర్తి అంటూ చెప్పుకొచ్చారు.. తన అత్తమామల మాదిరిగా దక్షిణాసియా నుంచి వలస వచ్చి అమెరికాలో సుసంపన్నమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారని చెప్పారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు రాజకీయాలు అవసరం లేదు.. రాజకీయాలకు మాత్రం ఆయన అవసరం ఉందన్నారు. ఉపాధ్యక్షునిగా పోటీ చేయడానికి జేడీ వాన్స్ ఆమోదం తెలిపారు.
Read Also: Healthy Habits: పనిలోపడి కూర్చుకీ అత్తుకొని పోతున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే..
అయితే, 39 ఏళ్ల జేడీ వాన్స్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అతి పిన్న వయసులో అమెరికా ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తిగా నిలుస్తారు. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి ఎవరనేది తేలే వరకు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ జరగడదని డొనాల్డ్ ట్రంప్ శిబిరం తేల్చి చెప్పింది. జేడీ వాన్స్‌ను అభ్యర్థిగా రిపబ్లికన్లు ప్రకటించగానే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చర్చకు రావాలని సవాల్ చేసింది.