అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి.
అగ్రరాజ్యమైన అమెరికాలో గన్‌కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో శుక్రవారం ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు జరగగా ఐదుగురు మృతి చెందారు.
అమెరికాలో కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అగ్రరాజ్యంలో తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలీ నగరంలో కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.
అమెరికాలో గన్‌కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా డేటన్‌కు ఉత్తరాన ఉన్న ఒహియోలోని బట్లర్ టౌన్‌షిప్‌లో మరో సారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.