shooting at Gay Nightclub: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు జరగగా ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి 11.57 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ సాయుధుడు కాల్పులు జరుపగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Joe Biden: వైట్ హౌస్‌లో నిరాడంబరంగా జో బైడెన్ మనవరాలి వివాహం
ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. దాడి వెనుక గల కారణాలపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్ 20న ‘ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ’ జరుపుకుంటుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల గురించి పోలీసులకు అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చిందని కొలరాడో స్ప్రింగ్స్ లెఫ్టినెంట్ పమేలా క్యాస్ట్రో చెప్పారు.