అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిముడి వద్ద పడవ ప్రమాదం జరిగింది. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గౌతమి గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం అంబాజీపేటలో అంతరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అంబాజీపేట జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో అంతర్రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరగగా.. పురోహిత జట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పంచెలు కట్టుకొని బ్రాహ్మణ పురోహితులు క్రికెట్ ఆడారు.
Mandapalli Saneeswaralayam: మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలోని కొత్తమండంలో మందపల్లిలోని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. శనిగ్రహణికి ఆదర్శమైన స్థలంగా, శనిదేవుడి పూజా క్షేత్రంగా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపచారానికి ఒడిగట్టాడు. లింగంపై నూనె బదులు ప్రెట్రోల్ పోశాడు. దీనిని గుర్తించిన ఆలయ అర్చకులు అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో బయట అమ్మితే కొన్నట్టు తెలిపాడు. అనంతరం…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.