ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ…