ఏపీ హైకోర్టులో ఇవాళ రిటైర్ అయిన జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు హైకోర్టు సీజే, సహచర న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత కుమార్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైకోర్టు జడ్జిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయం.
జస్టిస్ సత్యనారాయణ మూర్తి న్యాయమూర్తిగా అత్యధిక సంఖ్యలో 31వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. జస్టిస్ సత్యనారాయణ మూర్తి అన్ని రకాల కేసులను డీల్ చేశారు. పదవీ విరమణ చేసిన జస్టిస్ సత్యనారాయణ మూర్తి శేష జీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఆనందంగా సాగాలని సీజే ఆకాంక్షించారు.
రిటైర్ అయిన జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్ళుగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. తెలిపారు. జడ్జీగా నా విధులు నిర్వహించాను. హక్కుల పరిరక్షణకు నా వంతు కృషి చేశానన్నారు జస్టిస్ సత్యనారాయణ మూర్తి. ఈ సందర్భంగా హైకోర్టుకు భారీగా చేరుకున్నారు రాజధాని అమరావతి రైతులు. రిటైర్ అవుతోన్న జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు రాజధాని రైతులు. రహదారి వెంట పూలు పరిచారు అమరావతి రైతులు. రెండు కిలోమీటర్ల మేర రహదారి వెంట జాతీయ పతాకాలతో జస్టిస్ సత్యనారాయణ మూర్తికి వీడ్కోలు పలకడం విశేషం. ఈ సందర్భంగా రాజధాని రైతులకు అభివాదం చేశారు జస్టిస్ సత్యనారాయణ మూర్తి.