ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. టెస్ట్‌ల సంఖ్య 40 వేల దగ్గరల్లో ఉన్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేలకు పైగా ఉంటుంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,771 శాంపిల్స్ పరీక్షించగా.. 13,474 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 10,290 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మొత్తంగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 3,23,25,140కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 22,36,047కు పెరిగింది.. కోలుకున్నవారి సంఖ్య 21,11,975కు చేరింది.. ఇక, మృతుల సంఖ్య 14,579కు చేరగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,493గా ఉంది.. తాజా కేసుల్లో అత్యధికంగా.. కడపలో 2,031, కర్నూలులో 1835, విశాఖపట్నంలో 1349, గుంటూరులో 1342, ప్రకాశం జిల్లాలో 1259 కొత్త కేసులు వెలుగు చూశాయి.