అమరావతి : మూడు రాజధానుల పై సీఎం జగన్ చేసిన వ్యాక్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ తుగ్లక్ 3.0 అని… మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. నిప్పులు చెరిగారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అంటూ ఎద్దేవా చేశారు నారా…
అమరావతి : రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని వర్గాలకు వివరించేందుకు.. బిల్లులు మరింత మెరుగు పరిచేందుకు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు వివరించేందుకు గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని… మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. విశాల ప్రజా ప్రయోజనాల కోసమే…
మూడు రాజధానులను రద్దు చేసుకుంటున్నట్లు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ హైకోర్టు లో అపిడవిట్ కూడా దాఖలు చేశారు. అలాగే… దీనిపై మరికాసేపట్లోనే.. ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి తరుణంలోనే.. మూడు రాజధానులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని..…
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు…
పీఆర్‌సీపై నివేదిక ఇస్తేనే ఇండ్లకు వెళుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఏపీ సెక్రటేరియల్‌లో సుమారు 5 గంటల పాటు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వాపోయారు. రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. 11వ పీఆర్‌సీపై రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు. పాదయాత్ర చేస్తూనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబం ధనల ఉల్లంఘన జరిగితే…
వరుసగా పెరుగుతూ పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టించాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. కేంద్రం కోత విధించింది.. ఇక, కేంద్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి కాగా.. పెట్రో ధరలపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇవాళ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ…
నా చర్మంతో సీఎం వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తాజాగా ఆయన శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇక, వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు.. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు వచ్చాయి..…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైందని.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వెల్లడించిన ఐఎండీ.. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ…