అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.