అమరావతి బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. మన్యంలో స్వాతంత్ర్య పోరాట కాంక్షను రగిలించారు.. breaking news, latest news, telugu news, somu verraju, alluri sitaramaraju,
ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చంద్రబాబు కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చడం సంతోషమని, ఈ విషయంలో తెలుగు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. Read Also: RK…
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.…
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి…
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అల్లూరి సీత రామరాజును తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని బీజేపీ నేతలు వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని ఎద్దేవ చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్నలా తలవూపడం విడ్డూరంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పచ్చి అబద్దాలు మాట్లాడారని మండి పడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేటీఆర్ సవాల్ కు…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని…
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు…