అమరావతి బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. మన్యంలో స్వాతంత్ర్య పోరాట కాంక్షను రగిలించారు అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో అందరూ పని చేయాలని, సీతారామరాజు కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయన్నారు. డ్రొన్లతో శత్రుదేశాలపై దాడి చేసే సాంకేతికతను సొంతం చేసుకున్నామని, పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్థంతి కూడా ఇవాళేనని, కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య స్వాతంత్ర పోరాట స్పూర్తిని ఆకళింపు చేసుకుని జెండా రూపొందించారని ఆయన గుర్తు చేశారు.
Also Read : India And Taiwan: ఇండియాకు సెమీకండక్టర్ పరిశ్రమ.. చైనా నుంచి తరలనున్న తైవాన్ కంపెనీ
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం హిందువుల స్థలాలు ఆక్రమించుకుంటుందని నిన్న సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మతమార్పిడులు చేయడానికి స్థలాలు లీజ్‌కి ఇస్తున్నారు. హిందుత్వ వ్యతిరేక ధోరణిని వ్యతిరేకిస్తున్నాం. అవధూత ట్రస్ట్ స్థలంలో బ్రిటీష్ వారి కాలంలో నేచురల్ వైద్యం జరిగింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో అవధూత ట్రస్ట్ స్థలం ఉంది. దీన్ని లీజుకు ఇచ్చే ఆలోచనలో దేవాదాయ శాఖ ఉంది. ఏపీలో ఆయుర్వేద కళాశాల లేదు.. యునాని ఊసే లేదు. కేంద్రం సిద్ధ ఆస్పత్రిని తిరుపతిలో.. ఆయుర్వేద ఆస్పత్రిని విశాఖలో.. 100 బెడ్ల ఆస్పత్రి గన్నవరంలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ స్థలాలను లీజుకు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే ఇక్కడ నేచర్ క్యూర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని సోము వీర్రాజు అన్నారు.
Also Read : Vangaveeti Radhakrishna : కులమతాలకు అతీతంగా రంగా గారి జయంతి