ఈ నెల 13న పోలింగ్ రోజు ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపుపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి జిల్లాకూ ప్రత్యేక పోలీస్ అధికారుల నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జరీ చేశారు. ఏపీ డీజీపీ హరీష్ ఉత్తర్వుల ప్రకారం.. 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు.