కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..