ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నానుతోంది. ఈ ఆస్పత్రి కిందనే భారీ సొరంగాలు ఉన్నాయని, టెర్రరిస్టుల టన్నెల్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ ఆస్పత్రి కిందనే అతిపెద్ద ఉగ్రవాద సొరంగాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది.
గాజాలోని అల్ షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ సైనికులు ముమ్మరంగా గాలించారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు నేడు కూడా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది.