ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు దాచి పెట్టారు అనే అనుమానంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టింది. గాజా అల్ షిఫా ఆసుపత్రి కింద సొరంగంలో హమాస్ కమాండ్ సెంటరును నిర్మించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆసుపత్రిలో నవజాత శిశువులతో సహా వేలాది మంది రోగులపై ఇజ్రాయెల్ భద్రతాధికారులు దాడి చేయడాన్ని ఐక్యరాజ్య సమితి, మధ్య ప్రాచ్య దేశాలు ఖండించింది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్లు, మందు గుండు సామగ్రి, ఫ్లాక్ జాకెట్లను హస్పటల్ కాంప్లెక్స్ నుంచి ఇజ్రాయెల్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Mohammed Shami: ఆ క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా.. నా వంతు కోసం వేచి చూశా: షమీ
అయితే, గాజాలోని అల్ షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ సైనికులు ముమ్మరంగా గాలించారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు నేడు కూడా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగించారు. ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని ఇజ్రాయెల్ చెప్పింది. ఇజ్రాయెల్ ట్యాంకులు మెడికల్ కాంపౌండ్ లోపల ఉన్నాయని, సైనికులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యవసర, శస్త్రచికిత్స విభాగాల్లోకి ప్రవేశించారని వైద్యులు పేర్కొన్నారు. తాము ప్రత్యేకంగా హమాస్ ఉగ్రవాదుల కోసం వచ్చామని పౌరుల కోసం కాదని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా సమీపంలోని ఇజ్రాయెల్ దళాలను నెతన్యాహు కలుసుకున్నారు.
Read Also: Atrocious: ములుగు లో దారుణం.. ప్రేమ జంట ఆత్మహత్య..
ఇక, గాజా నగరంలోని అల్-షిఫా హస్పటల్ లో దొరికిన ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఆయుధాలు, సైనిక సామగ్రిని వెలికి తీసే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్ షిఫా ఆసుపత్రి టన్నెళ్లలో ఇజ్రాయెల్ సైనికులు బుల్డోజర్లతో గాలిస్తున్నారు. ఆసుపత్రి చుట్టూ బుల్డోజర్లను మోహరించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సేనలు ఆవరణలోకి చొరబడటంతో అన్ని విభాగాలకు నీరు, విద్యుత్, ఆక్సిజన్ నిలిపివేశారని అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ వెల్లడించారు.