(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు. అయితే దాని కంటే ముందుగా…
గ్యాడ్జెట్స్ మీద కొంతమందికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదయా! రకరకాల ఫోన్లు వాడాలని కొందరు తపిస్తుంటారు. తారలు సైతం అందుకు మినహాయింపేమీ కాదు. యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి కూడా అలాంటి అలవాటే ఉంది. మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తే చాలు – దానిని పట్టేయాలని చూస్తారు. నచ్చిందో… అంతే సంగతులు – దానిని కొనేసి ప్యాకెట్ లో పెట్టేసుకుంటాడు. అదీ అఖిల్ పంథా. అయితే ఏ సెల్ ఫోన్ కొన్నా, అందులో…
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల…
సెప్టెంబర్ 20న టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో పంచెకట్టుతో కన్పించిన నాగార్జున “మై హీరో, మై ఇన్స్పిరేషన్…” అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు. Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ “సెప్టెంబర్ 20న నాకు చాలా ముఖ్యమైన రోజు. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన…
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది. చిత్రం ఏమంటే……
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో…