Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు ఒక్క సినిమాను ప్రకటించినది లేదు. గతంలో బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ ను నాగ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.