Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు ఒక్క సినిమాను ప్రకటించినది లేదు. గతంలో బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ ను నాగ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు దానిమీద క్లారిటీ ఇచ్చిన వారు లేరు. ఇక బిగ్ బాస్ సైతం ఈసారి నాగ్ చేయను అన్నాడని టాక్. దీంతో అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై నాగ్ కనిపించి చాలా రోజులు అవుతుంది. అప్పుడప్పుడు బయట ఫంక్షన్స్ లో మాత్రమే మన్మథుడు కనిపిస్తున్నాడు. తాజాగా లవ్ యూ రామ్ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మెరిశాడు. ఆ ఈవెంట్ లో నాగ్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. నాగ్.. లుక్, బాడీ విషయంలో ఎప్పుడు శ్రద్ద వహిస్తూ ఉంటాడు.. 63 ఏళ్ళ వయస్సులోనూ ఆయన కుర్రాడిగానే కనిపించడానికి ఎంత కష్టపడతాడో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆ శ్రద్ద తగ్గిందేమో అనిపిస్తుంది. నాగ్ లో అంతకుముందున్న కళ కనిపించడం లేదంటున్నారు అభిమానులు.
Neha Shetty: అర్థరాత్రి నడిరోడ్డుపై.. ఇలా రెచ్చగొట్టొచ్చా రాధికా
ఇక ఈ ఈవెంట్ లో నాగ్.. మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. లాంగ్ హెయిర్ ముందుకు పడకుండా హెయిర్ బ్యాండ్ తో టైట్ గా పెట్టాడు. కొద్దిగా గడ్డం.. అక్కడక్కడా వైట్ హెయిర్ తో నాగ్ లుక్ కొంచెం కొత్తగా ఉంది. ముఖంలో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో కొంతమంది నాగ్ లుక్ బావుంది అంటుంటే.. ఇంకొంతమంది నాగ్ మామ ఏంట్రా.. ఇలా మారిపోయాడు అని అంటున్నారు. నాగ్ అభిమానులు మాత్రం ఒక సినిమా అనౌన్స్ చేస్తే బావుంటుంది అనుకుంటున్నాం అని చెప్పుకొస్తున్నారు. మరి నాగ్.. ఈ ఏడాది అయినా ఒక సినిమాను అనౌన్స్ చేస్తాడా..? లేదా.. ? అనేది చూడాలి.