యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. తన తదుపరి చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ షాకింగ్ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిన విషయం తెలిసిందే. ‘ఏజెంట్’ షూటింగ్‌ను ప్రారంభించే ముందు తన లుక్స్ కోసం జిమ్ లో నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు.…
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని…
తెలుగు స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. ఆ మధ్యలో ‘అతిథి’ సినిమా తర్వాత మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. 2007 అక్టోబర్ లో ‘అతిథి’ విడుదలై పరాజయం పొందాక, సినిమా నటనకు దూరంగా ఉన్న మహేశ్ కేవలం యాడ్స్ నటిస్తూనే మూడేళ్ళు గడిపేశాడు. అతని అభిమానులకు అవే కాస్తంత ఓదార్పును కలిగించాయి. ‘అతిథి’ వచ్చిన మూడేళ్ళకు గానీ ‘ఖలేజా’ మూవీ రిలీజ్…
అక్కినేని యంగ్ హీరో అఖిల్ మొత్తానికి తొలి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. గత శుక్రవారం విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా అమెరికాలోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అఖిల్ – ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం…
ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర…
నాగార్జున తనయలు నాగచైతన్య, అఖిల్ ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్నారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’తో పాటు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రెండూ విజయవంతం కావటంతో నాగ్ ఆనందానికి హద్దే లేదు. ఓ వైపు తను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్5’ కూడా మెల్ల మెల్లగా ప్రజాదరణ పొందటం, తనయులు ఇద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కావటం ఆయన ఆనందానికి కారణాలు. ఇక గతంలో నాగచైతన్య కు ‘100…
అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”…
దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయప్రకాష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం…
గ్యాడ్జెట్స్ మీద కొంతమందికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదయా! రకరకాల ఫోన్లు వాడాలని కొందరు తపిస్తుంటారు. తారలు సైతం అందుకు మినహాయింపేమీ కాదు. యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి కూడా అలాంటి అలవాటే ఉంది. మార్కెట్ లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తే చాలు – దానిని పట్టేయాలని చూస్తారు. నచ్చిందో… అంతే సంగతులు – దానిని కొనేసి ప్యాకెట్ లో పెట్టేసుకుంటాడు. అదీ అఖిల్ పంథా. అయితే ఏ సెల్ ఫోన్ కొన్నా, అందులో…