అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 8 న వీరిద్దరి ఆన్ స్క్రీన్ ‘పెళ్లి’ తేదీ అని ఇంతకుముందు ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ అదే డేట్ ను కన్ఫర్మ్…
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన…
సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ…
అక్కినేని అఖిల్ 5వ చిత్రం “ఏజెంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్యాంటులో తుపాకీ పెట్టుకుని సూపర్ హాట్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం మన యంగ్ హీరో చాలానే కష్టపడ్డాడు. ఆయన పడిన శ్రమ పోస్టర్ లో స్పష్టంగా కన్పిస్తోంది. సురేందర్ రెడ్డి…
అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ యంగ్ హీరోను ఇంతకుముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నారు. అక్కినేని అభిమానులను థ్రిల్ చేయడానికి “ఏజెంట్” ఫస్ట్ లుక్ ను అఖిల్ పుట్టినరోజున విడుదల చేయబోతున్నారు. Read Also : పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో ఇక తాజాగా అఖిల్…
కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న…
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లుగా పైగా అవుతున్న.. సరైన హిట్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని దాదాపుగా పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అఖిల్-సురేందర్ దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో…
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే.. తన పాత్రను వెల్లడించింది. స్టాండప్ కమెడియన్గా కనిపించనున్నట్లు పేర్కొంది. రోజుల తరబడి చేసిన సాధనను ఒక…
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ…