Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు.