Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది.
తాజాగా వార్తాపత్రిక టైం మేగజీన్ 2024 కి సంబంధించి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఈ మేగజీన్ ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలతో ఎవరైతే కీలకంగా ముడిపడి ఉంటారో.. అందులో ముఖ్యంగా మనుషులను ప్రభావితం చేసే వ్యక్తులను ఈ సంస్థ తన లిస్టులో చేరుస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టైమ్స్ మేగజీన్ తన వివరాలను వెల్లడించింది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అన్న విషయానికి వస్తే.. Also…
భారత జీ20 అధ్యక్షత గురించి ప్రశంసలు కురిపించారు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా. భారత్ తన జీ20 ప్రెసిడెన్సీలో ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించిందని, జీ20 డిక్లరేషన్‌ను అన్ని జీ20 దేశాలు ఏకాభిప్రాయంగా ఆమోదించాయని ప్రశంసించారు.
ఇటీవల భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్‌కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు.
భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు ఢిల్లీ వచ్చిన తర్వాత కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్‌పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు మాజీ మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను వాషింగ్టన్ నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు.