కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా.. అతని నుండి కొకైన్, హెరాయిన్ ను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 44 కోట్ల విలువ ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కరెంటు కోతతో దేశం మొత్తం అతలాకుతలమైంది. కెన్యాలో శుక్రవారం రాత్రి విద్యుత్ నిలిచిపోయింది. ఏకంగా 14 గంటల పాటు కరెంటు కటకట ఏర్పడింది. ఇటీవలి సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక విద్యుత్ కోత ఇదేనని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది.
ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి…
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడో విడత వారాహి యాత్రను స్టార్ట్ చేయనున్నారు. అయితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎరివల్ పాయింట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకుంది. బారి కేడ్లు, రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసింది.
ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Unlimited Food: ప్రజల అవసరాలలో ఆహారం ఒకటి. ఈ అవసరాన్ని నెరవేర్చుకునేందుకు ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చాలా సార్లు ప్రజలు మంచి ఆహారం తినడానికి రెస్టారెంట్లకు కూడా వెళ్తారు.
ఇటీవల హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీగా పట్టుకుంటున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరోసారి బంగారాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 1.88 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారంనాడు సీజ్ చేశారు. జెడ్డా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు ఇవాళ ఈ బంగారాన్ని సీజ్ చేశారు.. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా కోటికి పైగా ఉంటుందని అంచనా…
ముంబైలోని కొన్ని కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఏంటీ కుక్కలకు గుర్తింపు కార్డులా అని షాక్ అవుతున్నారా.. నిజమే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఎంసీ.. 20 వీధికుక్కలకు గుర్తింపు కార్డులను తయారు చేసి వాటి మెడలకు వేసింది.